Description
క్యాప్సికమ్ లేదా స్వీట్ బెల్ పెప్పర్ సొలనేషియా ఫ్యామిలికి సంబంధించినది. ఈ మొక్క చిల్ పెప్పర్, కేయాన్ పెప్పర్ మొదలగు రూపంలో పండిస్తారు. క్యాప్సికమ్ చాలా డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. ఇవి గ్రీన్ కాలర్ లో మాత్రమే కాదు, పర్పుల్ కలర్ లో కూడా ఉంటాయి. ఇవి కొద్దిగా బిట్టర్ టేస్ట్ తో ఉంటాయి. ఎల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ లో ఉన్న క్యాప్సికమ్ లు స్వీట్ టేస్ట్ తో ఉంటాయి .
ప్రపంచం మొత్తంలో క్యాప్సికమ్ చాలా ఫేమస్ అయిన గ్రీన్ వెజిటేబుల్. గ్రీన్ క్యాప్సికమ్ వివిధ రకాలుగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఇండియాలో ఈ గ్రీన్ క్యాప్సికమ్ ను ‘సిమ్లా మిర్చి’, ‘బోపాలి మిర్చి’, ‘పెద్దమిరిప’ ఇలా వివిధ రకాల పేర్లుతో పిలుచుకుంటారు.
క్యాప్సికమ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో..ఒకసారి తెలుసుకుందాం…
ఎగ్-క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్
క్యాప్సికమ్ చూడటానికి ట్రాక్టివ్ గా కనబడటం మాత్రమే కాదు, ఇందులో అనేక న్యూట్రీషియన్స్, విటమిన్, ఎ, సి, మరియు కెలు ఫైబర్, కెరోటినాయిడ్స్, అధికంగా ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.
ఆర్థ్రైటిస్ ను నివారిస్తుంది:
క్యాప్సికమ్ ఆర్థ్రైటిస్ సమస్యను నివారిస్తుంది. బెల్ పెప్పర్ ను సించోనాతో కలిపి తినడం వల్ల ఈ హెర్బ్ కాంబినేషన్ కారణంగా గౌట్ మరియు రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ను నివారించుకోవచ్చు.
క్యాన్సర్ నివారిణి :
క్యాప్సికమ్ లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది హెల్తీ అండ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్ . అవేకాకుండా, సల్ఫర్ కాంపౌండ్స్ మరియు కెరోటినాయిడ్స్ వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఐరన్ లోపంను నివారిస్తుంది :
క్యాప్సికమ్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది ఐరన్ కంటెంట్ ను గ్రహిస్తుంది. దాంతో అనీమియా వంటి సమస్యలను నివారించుకోవచ్చు .
డయాబెటిస్ ను నివారిస్తుంది :
ఈ వెజిటేబుల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను నివారిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.
బరువు తగ్గిస్తుంది:
క్యాప్సికమ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఫాస్టింగ్ అవసరం లేకుండా ఏవిధంగా బ్లడ్ ప్రెజర్ లేదా హార్ట్ రేట్ పెరగకుండా మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫలితంగా హార్ట్ రేటును క్రమంగా తగ్గించుకోవచ్చు.
స్కిన్ అండ్ బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది :
క్యాప్సికమ్ లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది బాడీ స్కిన్ కు సపోర్ట్ చేస్తుంది. జాయింట్ కు అవసరమయ్యే విటమిన్ కెను అధించి, రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఇది బోన్స్ స్ట్రాంగ్ గా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.
కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
క్యాప్సికమ్ లో ఉండే విటమిన్ ఎ, కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రేచీకటి సమస్యను నివారిస్తుంది. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ వయస్సైయ్యే కొద్ది ద్రుష్టిలోపం, మాస్క్యులర్ డీజనరేషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్యాప్సికమ్ లో ఉండే విటమిన్ సి, కెరోటిన్స్ ఐ కాంటరాక్ట్స్ కు వ్యతిరేకంగా మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది.
హార్ట్ హెల్త్ కు మేలు చేస్తుంది:
రెడ్ క్యాప్సికమ్ హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. రెడ్ క్యాప్సికమ్ లో లైకోపిన్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. గ్రీన్ క్యాప్సికమ్ లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను గ్రేట్ గా తగ్గిస్తుంది. బెల్ పెప్పర్స్ లో ఉండే విటమిన్ బి6 మరియు ఫొల్లెట్ హీమోసైటనిన్ కంటెంట్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇవి హార్ట్ కు హానికలిగిస్తాయి.
జీర్ణ శక్తిని పెంచుతుంది:
క్యాప్సికమ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెన్షనల్ సమస్యలను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.
Reviews
There are no reviews yet.