Description
Onion can fill your kitchen with a thick spicy aroma. It is a common base vegetable in most Indian dishes, thanks to the wonderful flavor that it adds to any dish.
Product image shown is for representation purpose only, the actually product may vary based on season, produce & availability.
ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ… ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి.
ఇంతటి మహత్తరమున్న ఉల్లిగడ్డలను భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరవూపదేశ్, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, మధ్యవూపదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్లలో ఈ ఉల్లిగడ్డలు ఎక్కువగా పండుతున్నాయి. పచ్చివి తిన్నా, ఉడకబెట్టి తిన్నా, ఫ్రైం చేసుకున్నా, రోస్ట్ చేసుకున్నా… కూరలకు అదనపు ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది ఉల్లిగడ్డ. సూప్స్ తయారీలో కూడా ఉల్లిది ప్రధాన పాత్ర.
Reviews
There are no reviews yet.